న్యూ ఇయర్ షాక్ : భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు..

తాజాగా నిపుణుల నివేదికల ప్రకారం ఇప్పటికే ఎల్ జి, పానాసోనిక్, హైయర్ వంటి బ్రాండ్ ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను

Update: 2022-01-11 05:02 GMT

కొత్త సంవత్సరం మొదలై 15 రోజులైనా కాలేదు. అప్పుడే సామాన్యుడికి భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ ధరలకు రెక్కలు రానున్నాయి. ఇన్ పుట్ ఖర్చుల భారం కారణంగా ఎలక్ట్రానిక్ కన్స్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల తయారీదారులు రిటైల్ ధరలను పెంచినట్లు ప్రకటించారు. ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నాటికి వాషింగ్ మెషీన్ ల ధరలు 5 - 10 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా నిపుణుల నివేదికల ప్రకారం ఇప్పటికే ఎల్ జి, పానాసోనిక్, హైయర్ వంటి బ్రాండ్ ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పెంచేశాయి. గోద్రేజ్, సోనీ, హిటాచి వంటి బ్రాండ్ లు ఈ త్రైమాసికం చివరి నాటికి ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) సమాచారం ప్రకారం..జనవరి నుంచి మార్చి మధ్య ఉత్పత్తులు కంపెనీల పాలసీలకు అనుగుణంగా 5నుంచి 7శాతం వరకు పెరగవచ్చు. కోవిడ్ కారణంగానే వీటి ధరలు ఇంతభారీగా పెరుగుతున్నట్లు కంపెనీల యాజమాన్యాలు చెప్తున్నాయి.


Tags:    

Similar News