Narendra Modi : తెలంగాణలో వచ్చేది బీసీ ముఖ్యమంత్రి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తొమ్మిదేళ్లుగా బీసీ,ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు ఒక్కటేనని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని అన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేశామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సి. టీమ్ అని ఆయన అన్నారు. బీజేపీలోనే ఓబీసీ ప్రధాని కాగలిగాడన్నారు. లోక్‌సభ తొలి దళిత స్పీకర్ గా బీజేపీయే చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మోదీ అన్నారు.
ఈ గ్రౌండ్ తో అనుబంధాన్ని...
ఎల్.బి. గ్రౌండ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడి నుంచే తాను ప్రధానిని అయ్యానని అన్నారు. నాడు తన ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారన్నారు. ఎల్.బి. స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో బీసీలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. బీసీ యువతకు ఉపాధి అవకాశాలు బీజేపీ వల్లనే లభిస్తాయని అన్నారు. కేంద్ర కేబినెట్ లో అనేక మంది బీసీ మంత్రులున్నారని తెలిపారు. బీసీలకు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మాట తప్పిందని మోదీ అన్నారు. బీసీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయానికి గురవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఈసారి బీసీ సీఎం రాబోతున్నారు.
తెలుగులో ప్రారంభించి...
మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎవరికైతే అహంకారం ఉంటుందో వారిని ఉపేక్షించకూడదన్నారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలను కూడా లీకేజీ చేసి యువతను భవిష్యత్ ను ఫణంగా పెట్టారని మోదీ అన్నారు. ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో వారి నుంచి మళ్లీ సొమ్ములు రాబడతామని మోదీ అన్నారు. అన్ని పరీక్షల్లో అవకతవకలు కామన్ అయిపోయాయన్నారు. అవినీతిని అంతం చేస్తామని, ఇదే మోదీ ఇచ్చే గ్యారంటీ అని అన్నారు. అవినీతిని చేసేవారిని వదిలిపెట్టేది లేదని మోదీ హెచ్చరించారు. యువత బీజేపీ విజయానికి కృషి చేయాలన్నారు.