లక్ష్యం 25 ఏళ్లు... సాధించాల్సిందే

వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తిగా మార్చి వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

Update: 2022-08-15 03:03 GMT

వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తిగా మార్చి వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందచేశారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రధాని హోదాలో 9వ సారి ఎర్రకోట పై జాతీయ జెండాను మోదీ ఎగుర వేశారు. అంతకు ముందు రాజ్్ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం నవసంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. ఎంతో మంది మహనీయులకు దేశం జన్మనివ్వడం అదృష్టమన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిందని మోదీ అన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యమని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని తెలిపారు. వాటిని ఎదుర్కొని నిలిచి అభివృద్ధి వైపు పయనిస్తున్నామని తెలిపారు. దేశం ఈరోజు ఒక మైలురాయిని దాటిందన్నారు.

ప్రపంచం భారత్ వైపు....
ప్రపంచం భారత్ వైపు చూసేలా చేయగలిగామని మోదీ తెలిపారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి దానిని తరిమికొట్టగలిగామని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ ను కూడా తయారు చేసుకోగలిగామని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ మరింత ముందుకు వెళుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు కొత్త దిశ, దశను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి లక్ష్యాన్ని సంకల్పంతో పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ముందున్న మార్గం కఠినదని అన్నారు. ప్రపంచం భారత్ తనదైన ముద్ర వేసిందన్నారు. ఆకలి కేకల భారత్ ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తుందన్నారు. దేశంలోని అన్ని భాషలను చూసి గర్వపడాలన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ లు మన టాలెంట్ కు ఉదాహరణగా నిలిచాయని మోదీ అన్నారు.
ఐదు అంశాలపై....
నరుడిలో నారాయణుడిని చూసే సంస్కృతి భారతదేశానిదని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2047 కల్లా స్వాతంత్రత్య సమరయోధుల లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలన్నారు. వచ్చే 25 ఐదేళ్లలో ఐదు లక్ష్యాలతో ముందుకు సాగాలని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపాలన్నారు. బానిసత్వాన్ని నిర్మూలించడం, స్వాంతంత్ర్య సమర యోధుల త్యాగాలపై గౌరవం ఉంచాలన్నారు. లక్ష్యాల కోసం పని చేయాలనే వజ్ర సంకల్పంతో పని చేయాలని మోదీ పిలుపు నిచ్చారు. దేశాన్ని రక్షించుకుంటేనే అన్ని రంగాల్లో ముందుకు పయనించాలని ఆయన అన్నారు.


Tags:    

Similar News