చిన్నమ్మ చిటికెలో తేల్చేశారు

పురంద్రీశ్వరి తన రాజీకయ ప్రస్థానంపై పెదవి విప్పారు. పురంద్రీశ్వరిని కూడా వైసీపీ లోకి తీసుకురావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ నేతలు షరతు విధించిన సంగతి తెలిసిందే. [more]

Update: 2019-10-29 06:47 GMT

పురంద్రీశ్వరి తన రాజీకయ ప్రస్థానంపై పెదవి విప్పారు. పురంద్రీశ్వరిని కూడా వైసీపీ లోకి తీసుకురావాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ నేతలు షరతు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు అంగీకరించని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు. రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన పురంద్రీశ్వరి దీనిపై స్పందించారు. తనకు వైసీపీలోకి రావాలని ఎటువంటి ఆహ్వానం లేదన్నారు. ఎన్నికలకు ముందు అడిగినా తాను అంగీకరించలేదన్నారు. వైసీపీలో చేరడానికి ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంద్రీశ్వరి బీజేపీలోనే కొనసాగుతుందని ఆ పార్టీ అధిష్టానానికి చెప్పారని, ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చిందో తనకు తెలియదని పురంద్రీశ్వరి తెలిపారు.

Tags:    

Similar News