వైసీపీతో పొత్తు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైసీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుందని బీజేపీ నేత పురంద్రీశ్వరి ప్రశ్నించారు. భవిష్యత్తులో వైసీపీ, టీడీపీలతో పొత్తు బీజేపీ పెట్టుకోదని పురంద్రీశ్వరి స్పష్టం చేశారు. [more]

Update: 2020-02-16 07:39 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైసీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటుందని బీజేపీ నేత పురంద్రీశ్వరి ప్రశ్నించారు. భవిష్యత్తులో వైసీపీ, టీడీపీలతో పొత్తు బీజేపీ పెట్టుకోదని పురంద్రీశ్వరి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, మరే ఇతర పార్టీతో పొత్తు ఉండదని పురంద్రీశ్వరి పేర్కొన్నారు. రెండు పార్టీలు తమ వివాదాల్లోకి బీజేపీని లాగేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా ప్రధానిని, మంత్రులను జగన్ కలిస్తే పొత్తు కుదిరినట్లేనా? అని ఆమె ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి మాణిక్యాలరావు సయితం వైసీపీ, బీజేపీ పొత్తును ఖండించారు. వైసీపీ, టీడీపీలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News