బ్రేకింగ్ : జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు భీమవరంలో అరెస్ట్

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. పుట్టమధును భీమవరంలో అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. [more]

Update: 2021-05-08 03:58 GMT

పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. పుట్టమధును భీమవరంలో అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టా మధుపై ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది పోలీసులు స్పష్టం చేయలేదు. హైదరాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత పుట్టా మధును విచారిస్తారని తెలుస్తోంది. ఈటల రాజేందర్ తన పై వచ్చిన భూ ఆరోపణల తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటి నుంచి పుట్టా మధు కన్పించకుండా పోయారు.

Tags:    

Similar News