వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన సర్కార్
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ తిరస్కరించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం [more]
;
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ తిరస్కరించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం [more]
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ తిరస్కరించారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇటీవల భూమి పూజ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ కూడా విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం దీనిపై అభ్యంతరం తెలుపుతూ విగ్రహం ఏర్పాటుకు నిరాకరించారు. పబ్లిక్ ప్లేస్ లో విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై బీజేపీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.