మనీలాండరింగ్ కు పాల్పడ్డారు.. ఇవిగో ఆధారాలు

లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీ బిఆర్‌ నాయుడుపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు [more]

Update: 2021-07-27 02:19 GMT

లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్‌ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీ బిఆర్‌ నాయుడుపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలు జరిగాయని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలను సీఐడీ సేకరించిందని వైసీపీ ఎంపీలు వారికి వివరించారు. మనీలాండరింగ్ చట్టం కింద, విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు కోరారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను ప్రధానితోపాటు నిర్మలా సీతారామన్ కు కూడా వైసీపీ ఎంపీలు సమర్పించారు.

Tags:    

Similar News