హైదరాబాదీలకు అలర్ట్
హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. భారీ వర్షాలతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి
హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. భారీ వర్షాలతో నగరవాసులు అవస్థలు పడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి. అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిన్న రాత్రి భారీ వర్షం నమోదయింది. ట్రాఫిక్ ఇబ్బందులు అనేక ప్రాంతాల్లో తలెత్తాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ నీరు పొంగి రహదారుల పై ప్రవహిస్తుండటంతో అనేక చోట్ల కలుషిత నీరు రోడ్లపైకి, ఇళ్లలో చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నేడు కూడా భారీ వర్షం...
కొన్ని కాలనీల్లోకి ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని నగరవాసులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మ్యాన్‌హోల్ మూతలు ఎక్కడా తెరచి ఉంచకూడదని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు కోరుతున్నారు.
వర్షపాతం వివరాలు...
నిన్న హైదరాబాద్‌లో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. గాజులరామారం లో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హయత్ నగర్, చంద్రాయణ గుట్ట లో 2.9 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరి లో 2.8, ఫలక్ నుమా లో 2.3 సెంటిమీటర్లు. అల్వాల్ లో 2 సెంటిమీటర్లు, ఎల్.బి.నగర్ లో 1.8 సెంటిమీటర్లు.. కార్వాన్ లో 1.3 సెంటిమీటర్లు, శివరాంపల్లి లో 1.1 సెంటిమీటర్ల వర్షపాత నమోదయిందని అధికారులు తెలిపారు.