భారత ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా రాజీవ్ కుమార్ నియామకం

నిన్న సుశీల్ చంద్ర పదవీ విరమణ పొందగా.. నేడు రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ కేంద్ర ఎన్నికల సంఘంలో..

Update: 2022-05-15 13:31 GMT

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నిన్న సుశీల్ చంద్ర పదవీ విరమణ పొందగా.. నేడు రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ గా కొనసాగిన ఆయన్ను భారత ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఇటీవలే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2025 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు రాజీవ్ కుమార్ సీఈసీగా కొనసాగనున్నారు. 2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ను కూడా ఆయనే నిర్వ‌హించ‌నున్నారు.



Tags:    

Similar News