రాముడికి మూడు పూటలా హారతులు

మరి కొద్ది గంటల్లో అయోధ్య రాముడి విగ్రహానికి పున:ప్రతిష్ట జరగనుంది. ఈ పండుగ సంబరాలకు దేశమంతా సమాయత్తమవుతోంది. 2020 ఆగస్టు 5న ప్రారంభమైన నిర్మాణం, సోమవారం నాటి ప్రతిష్టాపనతో ఓ కొలిక్కి వస్తుంది. పూర్తి స్థాయిలో ఆలయ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి కంప్లీట్‌ అవుతుందని రామ జన్మభూమి ట్రస్ట్‌ చెప్పింది.

Update: 2024-01-21 12:10 GMT

మరి కొద్ది గంటల్లో అయోధ్య రాముడి విగ్రహానికి పున:ప్రతిష్ట జరగనుంది. ఈ పండుగ సంబరాలకు దేశమంతా సమాయత్తమవుతోంది. 2020 ఆగస్టు 5న ప్రారంభమైన నిర్మాణం, సోమవారం నాటి ప్రతిష్టాపనతో ఓ కొలిక్కి వస్తుంది. పూర్తి స్థాయిలో ఆలయ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి  కంప్లీట్‌ అవుతుందని రామ జన్మభూమి ట్రస్ట్‌ చెప్పింది. 2019 నవంబరు 9న రామజన్మభూమి ట్రస్ట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల శంకుస్థాపన కార్యక్రమం కాస్త ఆలస్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

రామ మందిర నిర్మాణ బాధ్యతలను పూర్తిగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చేపట్టింది. భవిష్యత్తులో నిర్వహణ బాధ్యతలు కూడా ఆ ట్రస్టువే. ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో సరయూ నదీ తీరాన ఉన్న 2.7 ఎకరాల్లో రామాలయ నిర్మాణాన్ని చేపట్టింది. రామాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ప్రహరీకి ఆనుకుని లోపల నాలుగు మూలలా సూర్యుడు, భగవతి, వినాయకుడు, శివుడి ఆలయాలు ఉన్నాయి. మందిరం ఉత్తరాన అన్నపూర్ణ దేవీ దక్షిణాన ఆంజనేయుడి విగ్రహాలు ఉన్నాయి.

ఇక ఆయోధ్యలో కొలువవుతున్న బాల రాముడికి మూడు పూటలా హారతి ఇస్తుంటారు. ఉదయం ఆరున్నరకు జాగరణ, మధ్యాహ్నం పన్నెండుకు భోగ, రాత్రి ఏడున్నర గంటలకు సంధ్యా హారతి ఉంటాయి. ఈ సమయంలో భక్తులకు ప్రత్యేక అనుమతి కూడా ఉంటుంది. ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే హారతికి హాజరు కావడానికి పాస్‌ ఇస్తారు. ఉదయం ఏడు నుంచి పదకొండున్నర వరకూ మధ్యాహ్నం రెండు నుంచి ఏడు గంటల వరకూ సాధారణ దర్శనాన్ని కల్పిస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి 1800 వందల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంతకంటే ఎక్కువ సొమ్మే విరాళాల రూపంలో వచ్చింది. ఓ దశలో ఇక విరాళాలు పంపవద్దంటూ ట్రస్ట్‌ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అయోధ్య రైల్వే స్టేషన్‌, బస్టాండుల నుంచి ఆలయం ఓ కిలోమీటర్‌ దూరంలోనే ఉంటుంది. ఆలయాన్ని చేరుకోడానికి రిక్షాలు, ఆటోలు సిద్ధంగా ఉంటాయి.

Tags:    

Similar News