శంషాబాద్ పీఎస్ కు వర్మ

దిశ ఘటనపై రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిందితుడైన చెన్నకేశవులు భార్యను [more]

Update: 2020-02-17 07:18 GMT

దిశ ఘటనపై రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిందితుడైన చెన్నకేశవులు భార్యను రాంగోపాల్ వర్మ కొన్ని రోజుల క్రితమే కలిశాడు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల తరఫున ఏం జరిగింది ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగానే శంషాబాద్ ఏసిపి ని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కలిశారు. కలిసి పలు వివరాలు కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్ కౌంటర్ జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనే విషయం ప్రశ్నించినప్పుడు సినిమాపై ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, సినిమా తీసేందుకు స్వేచ్ఛ ఉందని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

Tags:    

Similar News