రాజీనామాలకు సిద్ధమన్న టీడీపీ ఎంపీలు
ఢిల్లీలో జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆందోళనలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు లు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. [more]
ఢిల్లీలో జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆందోళనలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు లు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. [more]
ఢిల్లీలో జరుగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఆందోళనలో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు లు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైతే రాజీనామాలు చేస్తామని ఎంపీలు ప్రకటించారు. స్టీల్ ఫ్యాక్టరీని అమ్మే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఉండే ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించే దమ్ము ఉందా? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.