గొల్లపల్లి సూర్యారావు ప్యాలెస్ చూశారా?

ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజోలుకు ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అవినీతి సొమ్ముతో అక్రమ [more]

Update: 2019-12-17 06:20 GMT

ఏపీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజోలుకు ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అవినీతి సొమ్ముతో అక్రమ సంపాదనతో వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. పదిహేను కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ ను గొల్లపల్లి సూర్యారావు నిర్మించుకున్నారన్నారు. అటువంటి నేతలకు టిక్కెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ సభలో అల్లరి చేస్తుందని ఆరోపించారు. టీడీపీ ఆందోళనలతో తమ ప్రశ్నల సభలోకి రావడం లేదన్నారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, రాజోలులో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీల పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాపాక వరప్రసాద్ ఆరోపించారు.

Tags:    

Similar News