జనసేనలోనే ఉన్నాను కానీ ఆ ఒక్కటి మాత్రం?

ఇప్పటికీ తాను జనసేనలోనే ఉన్నానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ జనసేనను తాను వీడలేదని, అయితే కొన్ని విషయాల్లో పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని [more]

;

Update: 2020-02-27 07:34 GMT
రాపాక వరప్రసాద్
  • whatsapp icon

ఇప్పటికీ తాను జనసేనలోనే ఉన్నానని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ జనసేనను తాను వీడలేదని, అయితే కొన్ని విషయాల్లో పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. తాను దగ్గరగా ఉన్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదని, పార్టీలో ఉన్నానా? లేదా? అన్నదే ముఖ్యమని రాపాక వరప్రసాద్ చెప్పారు. తాను ఇప్పటికీ మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకువస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నది తన అభిప్రాయమని రాపాక వరప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News