పవన్ ఆదేశాలు బేఖాతరు

మూడు రాజధానుల ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని, ఈ బిల్లును తాను సమర్థిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారన్నారు. [more]

Update: 2020-01-20 10:40 GMT

మూడు రాజధానుల ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని, ఈ బిల్లును తాను సమర్థిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్నారన్నారు. జనసేన తరుపున ఆయన అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని తెలిపారు. తమ అధినేత కూడా ప్రతిపక్షంలో ఉండబట్టి వ్యతిరేకిస్తున్నారు కాని లేదంటే సమర్థించే వారని రాపాక వరప్రసాద్ తెలిపార. రాజధానిపై ప్రజల అభిప్రాయమే తన అభిప్రాయమన్నారు. అయితే బిల్లును వ్యతిరేకించమని ఈరోజు పవన్ కల్యాణ్ రాపాక వరప్రసాద్ ను ఆదేశించినా ఆయన మాత్రం అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టిన బిల్లును సమర్థించారు. రాజధాని తరలింపును జనసేన తరుపున సమర్థిస్తున్నానని, జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని రాపాక తెలిపారు.

Tags:    

Similar News