టీవీ9 తెరపై ప్రత్యక్షమైన రవిప్రకాష్

టీవీ9 యాజమాన్యంతో వివాదంపై రవిప్రకాష్ స్పందించారు. ఆయన పరారీలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా టీవీ9 తెరపై ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తనపై [more]

Update: 2019-05-09 14:39 GMT

టీవీ9 యాజమాన్యంతో వివాదంపై రవిప్రకాష్ స్పందించారు. ఆయన పరారీలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా టీవీ9 తెరపై ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తనపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని పేర్కొన్నారు. అందరిలో ఆందోళన నెలకొందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టులో 16వ తేదీన తమ కేసు విచారణకు రానుందని, ఈ కేసును ఆధారంగానే తీసుకొని సాటి ఛానళ్లు అనేక వార్తలు ప్రచారం చేశాయని, తన వార్తలు ప్రచారం చేసిన ఛానళ్లకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లోనైనా ఈ ఛానళ్లు తప్పుడు వార్తలు కాకుండా నిబద్ధతతో వార్తలు ప్రసారం చేయాలని కోరారు. నిజం చెప్పులు వేసుకునే లోగా అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందన్నారు. తనను ఎవరై అరెస్ట్ చేయలేదని, చేయరు కూడా అని స్పష్టం చేశారు. తాను టీవీ9 సీఈఓగానే మాట్లాడుతున్నానని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News