బ్రేకింగ్ : పోలీసుల అదుపులో రవిప్రకాష్
బంజారాహిల్స్ పోలీసులు టీవీ9 మాజీ సీఇఓ రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ కేసు విషయంలో పోలీసులు టీవీ9 స్టుడియోకు రాగా వారి విధులకు రవిప్రకాష్ [more]
బంజారాహిల్స్ పోలీసులు టీవీ9 మాజీ సీఇఓ రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ కేసు విషయంలో పోలీసులు టీవీ9 స్టుడియోకు రాగా వారి విధులకు రవిప్రకాష్ [more]
బంజారాహిల్స్ పోలీసులు టీవీ9 మాజీ సీఇఓ రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ కేసు విషయంలో పోలీసులు టీవీ9 స్టుడియోకు రాగా వారి విధులకు రవిప్రకాష్ ఆటంకం కల్పించారనేఅభియోగం ఉంది. ఈ క్రమంలో ఇవ్వాళ బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ఇంటికి వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గతంలో మూడు సార్లు ఈ కేసు విషయమై పోలీసులు పోలీసు స్టేషన్ కు రావాలని పిలిచినప్పటికి రవిప్రకాష్ హాజరుకాలేదు. దీంతో వారెంట్ జారీ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రవిప్రకాష్ ను విచారిస్తున్నారు.