133 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎన్నికలను చూసిందని, ముందస్తు ఎన్నికలకు బయపడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి అభివృద్ధి పనులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ ముందు మోకరిల్లారని విమర్శించారు. ఎన్నికల కోసం కేసీఆర్ తరచూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రగతి నివేదన సభ పేరును కేసీఆర్ ఆవేదన సభగా మార్చుకోవాలని అన్నారు.