హరీష్ రావుకు మంత్రి పదవి దక్కదు

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ చాలా రోజులకు మీడియా ముందుకొచ్చారు. ఆయన ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ [more]

Update: 2019-02-18 08:53 GMT

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ చాలా రోజులకు మీడియా ముందుకొచ్చారు. ఆయన ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నేత హరీష్ రావుకు సంబంధించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు ఈసారి మంత్రి పదవి రాదని, ఆయనతో పాటు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కూడా మంత్రి పదవులు దక్కవని ఆయన జోస్యం చెప్పారు. గౌరెల్లి, తోటపల్లి రిజర్వాయర్ పనుల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో హరీష్ రావుకు 600 కోట్లు దక్కాయన్నారు.

హరీష్ రావు అర్హుడు

ఈ డబ్బులతోనే గత ఎన్నికల్లో హరీష్ రావు 30 మంది అభ్యర్థులకు ఎన్నికల నిధులు పంచారని, ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ కేసీఆర్ కు చెప్పిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా హరీష్ రావు ఫోన్ లో చర్చలు జరిపారని, ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలిసిందని ఆయన తెలిపారు. కేటీఆర్ కంటే హరీష్ రావు అర్హుడని, మొదటి నుంచీ హరీష్ ఉద్యమంలో ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్, మోడీ ఒక్కటయ్యారు కాబట్టే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. తనను రాజకీయంగా వేదించేందుకే ఈడీ కేసు పెట్టారని తెలిపారు.

Tags:    

Similar News