టీఆర్ఎస్ సీనియర్ నేతకు రేవంత్ గాలం?

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. గతంలో పార్టీని విడిచి వెళ్లిపోయిన నేతల ఇళ్ల తలుపులు తడుతున్నారు. తాజాగా [more]

Update: 2021-08-07 12:21 GMT

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. గతంలో పార్టీని విడిచి వెళ్లిపోయిన నేతల ఇళ్ల తలుపులు తడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో చాలా సేపు చర్చించారు.దీంతో తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారన్న ప్రచారం జరుగుతుంది. గతంలో తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత తన మీద విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవి ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదన్న ఆగ్రహంతో తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది.

Tags:    

Similar News