కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో రేవంత్ ప్రచారాన్ని చేయాల్సి ఉంది. అయితే తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లకుండా మానుకున్నారు. కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తనకు భద్రత కల్పించక పోవడంతో తాను ప్రచారం చేయలేనని చెప్పారు. తనపై దాడులు చేసి దానిని నక్సలైట్లు దాడులుగా చిత్రీకరించాలని కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ కుమ్మక్కై తనకు భద్రత కల్పించడం లేదన్నారు. తనకు ప్రాణహాని ఉండటంతో తాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదన్నారు. తన వద్ద ఉన్న భద్రతాధికారులు తన వద్ద ఉండి ఆ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందజేస్తున్నారని, అందుకే తాను కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రతను కోరారన్నారు. ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వ బలగాలతో తనకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినా ఫలితం లేదన్నారు. అందుకే తాను ప్రచారానికి దూరంగా ఉన్నారన్నారు.