ఆర్జీవీ నారద పాత్ర..!

హిందూ పురాణాల్లో నారద మునీంద్రుడు ఏ వివాదాన్ని సృష్టించినా... దాని వెనుక ఓ లోక కళ్యాణం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పాత్రను ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పోషిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని వెనుక, ప్రతీ ట్వీట్‌ వెనుక తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడమనే మహత్తర లక్ష్యం ఉంటుంది.

Update: 2023-10-03 09:15 GMT

నోరు జారే నాయకులపై చర్యలు తప్పవా!

హిందూ పురాణాల్లో నారద మునీంద్రుడు ఏ వివాదాన్ని సృష్టించినా... దాని వెనుక ఓ లోక కళ్యాణం ఉంటుంది. ప్రస్తుతం అలాంటి పాత్రను ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పోషిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని వెనుక, ప్రతీ ట్వీట్‌ వెనుక తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టడమనే మహత్తర లక్ష్యం ఉంటుంది. ఇంత వరకూ రామ్‌ గోపాల్‌ వర్మకు సరైన కౌంటర్‌ ఇచ్చే తెలుగుదేశం నాయకులు లేరనే మాట యదార్థం. తెలుగుదేశం యువ కిశోరం లోకేష్‌, పట్టాభి లాంటి వాళ్లు ఆర్జీవీని విమర్శించినా, ఆయన లాజిక్‌గా ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం లేక మౌనంగా ఉండిపోయారు.

ఇటీవల మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, వైకాపా మంత్రి ఆర్‌.కె. రోజాపై చేసిన విమర్శలను వర్మ ట్విటర్‌లో ప్రస్తావించారు. యూ ట్యూబ్‌ లింక్‌ను కూడా షేర్‌ చేశారు. ఓ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. హైడ్రామా నడుమ బండారును అరెస్ట్‌ చేసి గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కంటే వేగంగా, తీవ్రంగా స్పందించి తెలుగుదేశం నాయకుడి అరెస్ట్‌కు కారణమయ్యారు వర్మ.

బండారు అరెస్ట్‌పై స్పందిస్తూ ఆర్జీవీ మంగళవారం మరో ట్వీట్‌ చేశారు. తెలుగుదేశం నాయకుడిపై చర్యలు తీసుకున్నందుకు పోలీసు శాఖను అభినందించారు. ‘నిన్ను చంపుతా, గుడ్డలూడదీస్తా, పీక పిసుకుతా అని విమర్శించే నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు శాఖను కోరారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసే రాజకీయ నాయకులపై, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసే నాయకులపై.. పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ కోరారు. దీనివల్ల ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు మేలు చేసినట్లువుతందని పోలీసు శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక రాబోయే కాలంలో ఎన్ని అరెస్ట్‌లు జరుగుతాయో, ఎవరెవరు ఊచలు లెక్కపెడతారో చూడాలి. ప్రజా జీవితంలో ఉంటూ, అవాకులు చెవాకులు మాట్లాడే నాయకులపై చర్యలు మంచివే. ఈ విధంగానైనా లోక కళ్యాణం సిద్ధిస్తుంది. కీప్ ఇట్ అప్ వర్మ.

Tags:    

Similar News