23న ఓయూలో…?
ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిసింది. భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు రెండు గంటల పాటు చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చెప్పినా దిగి రాకపోవడంతో భవిష్యత్ [more]
ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిసింది. భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు రెండు గంటల పాటు చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చెప్పినా దిగి రాకపోవడంతో భవిష్యత్ [more]
ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగిసింది. భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు రెండు గంటల పాటు చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు చెప్పినా దిగి రాకపోవడంతో భవిష్యత్ ఏంటన్న దానిపై వారు సుదీర్ఘంగా చర్చించారు. రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బంద్ ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ ఆర్టీసీ సమ్మె జరుగుతుందని నేతలు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వాలని 119 మంది ఎమ్మెల్యేలను కలవాలని నిర్ణయించారు. ఎంపీలను కూడా కలవనున్నారు.