బ్రేకింగ్ : ఆర్టీసీ చర్చలు విఫలం

ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు ముందు సూచించిన 36 డిమాండ్లన్నింటిపై  చర్చించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. కాని ఆర్టీసీ యాజమాన్యం మాత్రం [more]

Update: 2019-10-26 11:32 GMT

ఆర్టీసీ జేఏసీ నేతలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెకు ముందు సూచించిన 36 డిమాండ్లన్నింటిపై చర్చించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. కాని ఆర్టీసీ యాజమాన్యం మాత్రం 21 డిమాండ్ల పైనే చర్చిస్తామని చెప్పారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యానికి, జేఏసీ నేతలకు మధ్య చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అన్ని డిమాండ్లపై చర్చించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దీంతో జేఏసీ నేతలు చర్చల నుంచి బయటకు వచ్చేశారు. మళ్లీ చర్చలకు పిలిస్తే వస్తామని జేఏసీ నేతలు చెప్పారు.

 

Tags:    

Similar News