యూ టర్న్ తీసుకుంటారా..?

ఆర్టీసీ కార్మికులు సంశయంలో పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మె [more]

Update: 2019-10-25 13:19 GMT

ఆర్టీసీ కార్మికులు సంశయంలో పడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. 21 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా వారి భవితవ్యం మాత్రం అంతుచిక్కడం లేదు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గంటపాటు ఆర్టీసీ సమ్మెపై ఘాటుగా మాట్లాడారు. ఆర్టీసీ ముగింపే… సమ్మె ముగింపు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికుల్లో గుబులు రేపుతున్నాయి. ఇక త్వరలో కొత్త ఆర్టీసీని చూస్తారని చెప్పడం, రెండు, మూడు రోజుల్లో ఆరు,ఏడు వేల ప్రైవేటు బస్సులు వస్తాయని చెప్పడంతో ఆర్టీసీ కార్మికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

అంతా పేదలే…..

ఆర్టీసీలో పనిచేసే వారిలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవారే. డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం పనిచేస్తేకాని నెలకు జీతం రాదు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి వారిది. ఇప్పటికే సెప్టెంబర్ నెల జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్మికులు. ఇన్ని రోజులు ప్రతిపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నేతల ప్రసంగాలతో ఆర్టీసీ కార్మికులు ఏమి మాట్లాడలేకపోయారు. ప్రభుత్వంలో విలీనమైతే అంతకంటే ఏం కావాలని ఆలోచించారు. ప్రభుత్వంలో విలీనమవుతుందనే నాయకుల మాటలతో కార్మిక నేతలు మన భవిష్యత్తు బాగుపడుతుందనుకున్నారు. మరి ఇప్పుడేమైంది.

యూ టర్న్ తీసుకుంటారా..?

మళ్లీ కార్మికులు యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వ్యాఖ్యలతో బెదిరిపోయినట్లు తెలుస్తోంది. కుండబద్దలు కొట్టినట్లు కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామనే ఉద్దేశ్యాన్ని చెప్పడంతో ఇప్పుడు కార్మికులు ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంకోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పై కూకట్ పల్లి పోలీసు స్టేషన్లో డ్రైవర్ రాజు ఫిర్యాదు చేశాడు. సమ్మె పేరుతో అనేక మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల మనసులో విలీనం అనే విషాన్ని నింపారని, ఆయన మాటలు నమ్మి సమ్మెచేస్తున్నామని పేర్కొన్నాడు.

కార్మికుల్లో చర్చ…..

ఇలా కార్మికులు డోలాయమానంలో పడ్డారు. దరఖాస్తు చేసుకుని చేరితే తమకేం అభ్యంతరం లేదని కేసీఆర్ చెప్పండంతో ఉద్యోగాలు పోకముందే చేరిపోవాలా…. వద్దా…. మరి ఏం చేయాలి మన దారెటు అంటూ కార్మికులు చర్చించుకుంటున్నారు. మరి కార్మికులు యూ టర్న్ తీసుకుని విధుల్లో చేరుతారా లేక సమ్మెను కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది.

 

Tags:    

Similar News