ఎందుకు అనుమతి ఇవ్వరు…?

ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరి సభకు ప్రభుత్వం నికారించింది. దీంతో ఆర్టీసీ జేఏసీ [more]

Update: 2019-10-29 10:56 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 రోజులకు చేరింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరి సభకు ప్రభుత్వం నికారించింది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలను అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరూర్ నగర్ మైదానంలో కాకుండా సభకు ఎక్కడ అనుమతిస్తారో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. సరూర్ నగర్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు సభ నిర్వహిస్తామని కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. దీనిపై మళ్లీ కోర్టు విచారణ చేపట్టనుంది.

 

Tags:    

Similar News