పంతం ప్రాణాలమీదకు తెచ్చిందా …?
పంతం ప్రాణాలమీదకు తెచ్చింది. శబరిమల లో తమ సత్తా చాటాలని బురఖాలు ధరించి అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి తమ పంతం నెగ్గించుకున్నారు ఆ మహిళలు. ఇది దేశవ్యాప్తంగా [more]
పంతం ప్రాణాలమీదకు తెచ్చింది. శబరిమల లో తమ సత్తా చాటాలని బురఖాలు ధరించి అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి తమ పంతం నెగ్గించుకున్నారు ఆ మహిళలు. ఇది దేశవ్యాప్తంగా [more]
పంతం ప్రాణాలమీదకు తెచ్చింది. శబరిమల లో తమ సత్తా చాటాలని బురఖాలు ధరించి అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి తమ పంతం నెగ్గించుకున్నారు ఆ మహిళలు. ఇది దేశవ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది. అయ్యప్ప భక్తుల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. ఈ వ్యవహారం వెనుక కేరళ ప్రభుత్వం ఉందన్న ప్రచారం సాగింది. దీనికి కారణం వీరిద్దరికి సిపిఎం తో వున్న సంబంధాలు ఉండటంతో శబరిమల ప్రాంతం అంతా భీతావహం అయిపొయింది. ఇంతటి ఉపద్రవానికి కారణభూతులైన ఆ ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గ ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతపట్టుకుని సుప్రీం తలుపు తట్టారు.
భద్రత కల్పించండి …
ఆ ఇద్దరు మహిళలు సాహసం అయితే చేశారు. అయితే వారికి అప్పటినుంచి కష్టాలు మొదలు అయ్యాయి. హిందూ సంఘాల నుంచి ప్రాణాలు తీస్తామన్న హెచ్చరికలతో వీరిద్దరూ అజ్ఞాతానికి వెళ్లిపోయారు కొన్నాళ్ళు. ప్రాణహానీ ఉండటంతో తన అత్త ఇంట్లో తలదాచుకోవాలని భావించి వీరిలో ఒకరు దాడికి గురయ్యారు. సొంత అత్త సంప్రదాయాలను మంటకలుపుతావా అంటూ ఉతికేసింది. ఇంట్లో ఇలా బయటకు వెళితే మరో లా దాడులు సిద్ధంగా ఉండటంతో చేసేదిలేక ప్రాణ రక్షణకు సుప్రీం ను ఆశ్రయించారు ఆ ఇద్దరు మహిళలు. వీరు దాఖలు చేసిన ఫిర్యాదు సుప్రీం విచారించనుంది. అత్యున్నత న్యాయస్థానం వీరి కేసులో ఇచ్చే తీర్పు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తుంది.