ఆమె నెగ్గుకు రాగలదా….?
సబితా ఇంద్రారెడ్డి….. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారండరు. హోంమంత్రిగా, గనులశాఖా మంత్రిగా విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు [more]
సబితా ఇంద్రారెడ్డి….. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారండరు. హోంమంత్రిగా, గనులశాఖా మంత్రిగా విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు [more]
సబితా ఇంద్రారెడ్డి….. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారండరు. హోంమంత్రిగా, గనులశాఖా మంత్రిగా విధులు సమర్థవంతంగా నిర్వర్తించిన సబితా ఇంద్రారెడ్డి మరోసారి విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విద్యాశాఖను ఆమెగట్టెక్కించగలదానని ఎదురు చూస్తున్నారు.
వారసత్వంగా….
సబితా ఇంద్రారెడ్డికి రాజకీయాలు తెలియవు. భర్త మాజీ మంత్రి పి. ఇంద్రారెడ్డి అకాల మరణం తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఏబీసీడీలు కూడా తెలియని ఆమె భర్త మరణం తర్వాత 2000లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలోకి ప్రవేశించారు.
చరిత్రకెక్కిన సబిత…
2004లో కూడా అదే నియోజకవర్గమైన చేవెళ్ళ నుంచే నెగ్గిన సబిత నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గంను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004-09 కాలంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె , 2009 లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది, భారత దేశంలోనే తొలి మహిళ హోం మంత్రి గా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమసమయంలోనూ సబిత ఎన్నోఅడ్డంకులను ఎదుర్కొన్నారు. ఓ సారి రాజీనామాకు కూడా సిద్దపడ్డారు.
టి.ఆర్.ఎస్ లో చేరి……
2014లో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని అధిష్టానం సూచించడంతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేశాడు. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో సబిత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి పై గెలుపొందారు. 14 మార్చ్ 2019 లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెకు విద్యాశాఖ ను కేటాయించారు. ఇక్కడ తెలంగాణా రాష్ట్రంలో నూ తొలి మహిళా మంత్రిగా చరిత్ర సృష్టించారు.
సబితపై కేసీఆర్ నమ్మకం….
గత ఇంటర్ ఫలితాల సమయంలో తలెత్తిన గందరగోళ పరిస్థితుల్లో ఫలితాలు తారుమారవడంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ముందు భైఠాయించి నిరసనలకు దిగారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. నాటి విద్యాశాఖామంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం కొంత ఇబ్బందిపడ్డారు. ఎటువంటి ప్రకటనలు చేయకుండా స్తబ్దుగా ఉండిపోయారు. కాలక్రమేనా అది సద్ధుముణిగినా జగదీశ్వర్ రెడ్డికి విద్యాశాఖ పట్ల కొంత విముఖతే ఏర్పడింది. ఇదే సమయంలో తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో జగదీశ్వర్ రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖను సబితా రెడ్డికి కేటాయించారు. హోంమంత్రిగా, గనులశాఖ మంత్రిగా పనిచేసిన సబిత విద్యాశాఖను కూడా సమర్థవంతగా నిర్వహించగలరని కేసీఆర్ ఈ శాఖను సబితకు అప్పగించినట్లుగా సమాచారం.
మొదలైన సబిత మార్కు…..
మంత్రి పదవి చేపట్టిన మరుసటి రోజే ఆమె విద్యాశాఖలో మార్కు మొదలుపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి బాటలో నడిచారు. తనను అభిమానించేందుకు వచ్చే అభిమానులు, నాయకులు పూలదండలు, షాలువాలు, బొకేలు తీసుకురాకూడదన్నారు. వాటి బదులు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చూడదామన్నారు. సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. డ్రాప్ ఔట్స్ తగ్గించటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
సవాళ్లను ఎదుర్కొంటారా….?
ప్రస్తుతం విద్యాశాఖలో అనేక సవాళ్లున్నాయి. ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పిదాలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఇంటర్ బోర్డు హడావుడిగా మార్కులను విడుదల చేయడంతో పరీక్షలు బాగా రాసిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో పరీక్షల్లో ఫెయిలై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల చావులపై తెలంగాణ విద్యాశాఖ అంటేనే నమ్మకం లేకుండా పోయింది. మరో వైపు ప్రతిపక్షాలు విద్యాశాఖపై మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో వీటిన్నింటిని సక్రమమైన బాటలో పెట్టాల్సిఉంది. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న విద్యాశాఖను సబితమ్మ గాడిన పెట్టాలి.
ఈ చీకట్లు తొలగేనా…?
అనేక పాఠశాలల్లో అంధకారం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో చాలా పాఠశాలల్లో కరెంటు కట్ చేశారు. దీంతో ఫ్యాన్లు తిరగక విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. స్కూల్లో ఉన్న బోర్లు పనిచేయక మరుగుదొడ్లలో నీళ్లు లేక అపరిశుభ్రంగా మారుతున్నాయి. మరో వైపు టీచర్ల ప్రమోషన్లు, అంతర్ జిల్లా బదిలీలు, మోడల్ స్కూళ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ నేతలు మంత్రి సబిత దృష్టికి తీసుకువెళ్లారు.
టీచర్ల కొరత…..
అక్షరాస్యత ఉంటేనే ఏదైనా సాధ్యమనేది ప్రభుత్వ నినాదం. కాని ప్రభుత్వ పాఠశాలల్లో
ఉపాధ్యాయుల కొరత కనిపిస్తోంది. సుమారు 20వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిఉంది. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రిజల్ట్స్ ఎలా వస్తాయోనని అధికారులు కూడా ఆవేదనలో
సబిత నోట దత్తత మాట…
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనీసం ఒక్క పాఠశాలనైనా దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, విద్యార్థినుల సమస్యలను తీర్చడం పై ప్రజా ప్రతినిధులు చొరవచూపాలన్నారు సబిత. ఇలా అనేక సవాళ్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యాశాఖను సబిత ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. సో ఆమెకు మనం బెస్ట్ అఫ్ లక్ చెబుదామా...