బ్రేకింగ్ : షర్మిల పార్టీపై వైసీపీ స్పందన … జగన్ అందుకే వద్దన్నారు

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ తెలంగాణలో బలోపేతం చేయాలనుకున్నా [more]

Update: 2021-02-09 08:47 GMT

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉండకూడదన్నది ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ తెలంగాణలో బలోపేతం చేయాలనుకున్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అది కుదరదని జగన్ అనేక సార్లు అభిప్రాయపడ్డారన్నారు. రెండురాష్ట్రాల మధ్య అనేక అంశాలు, సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకోవడానికి ఒకే పార్టీ రెండు చోట్ల ఉండకూడదని సజ్జల తెలిపారు. ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరగాలన్నా అది సాధ్యం కాదన్నారు. షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రెండు మూడు నెలలుగా షర్మిల పార్టీ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని పట్టించుకోవాలన్న ఆలోచనలో జగన్ లేరన్నారు. అందుకే షర్మిల వేరే పార్టీని తెలంగాణలో పెట్టారన్నారు. కుటుంబలో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే నని సజ్జల చెప్పారు.

Tags:    

Similar News