దటీజ్ సజ్జనార్

సజ్జనార్… ఈ పేరు వింటేనే క్రిమినల్స్ నిద్రపోరు. 2008లో వరంగల్ లో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అప్పుడు కూడా నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. అప్పుడు [more]

Update: 2019-12-06 02:34 GMT

సజ్జనార్… ఈ పేరు వింటేనే క్రిమినల్స్ నిద్రపోరు. 2008లో వరంగల్ లో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అప్పుడు కూడా నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈసారి సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్నారు. షాద్ నగర్ ప్రాంతంలో దిశ హత్య, అత్యాచారం గత నెల 27వ తేదీన జరిగింది. దిశ హంతకులను ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది నినదించారు. చివరకు పార్లమెంటులో సయితం దిశ హత్య ఘటనపై చర్చ జరిగింది.

తెల్లవారు జామున…..

అయితే దిశ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి కోరారు. చర్లపల్లి జైలులోనే పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. అయితే సీన్ రీకనస్ట్రక్షన్ చేయడం కోసం దిశ హత్య జరిగిన ప్రాంతానికి నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంగా నిందితులందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు తెల్లవారుజామున 3.30గంటలకు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులను పోలీస్ కస్టడీకి అనుమతించిన మరుసటి రోజునే ఎన్ కౌంటర్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సంఘటన స్థలికి చేరుకున్నారు.

Tags:    

Similar News