ఓటుకు నోటు కేసులో సండ్ర?

ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ఈరోజు విచారణ జరిగింది. ఓటు కు నోటు కేసు నుంచి తన పేరును తప్పించాలని ఆయన [more]

Update: 2021-08-25 07:23 GMT

ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ ఈరోజు విచారణ జరిగింది. ఓటు కు నోటు కేసు నుంచి తన పేరును తప్పించాలని ఆయన పిటీషన్ వేశారు. ఓటు కు నోటు కేసులో అవినీతి నిరోధక చట్టం వర్తించదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసేంతవరకూ ఈ కేసులో విచారణ చేపట్టవదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటీషన్లు వేశారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడానికి సెప్టంబరు 31వ తేదీవరకూ గడువు ఇచ్చింది. సండ్ర, రేవంత్ రెడ్డిలు కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసేందుకు సెప్టంబరు 6వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టంబరు 7వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News