పదిమందిని చంపినా పశ్చాత్తాపం లేదే?… గూగుల్ లో సెర్చ్ చేసి మరీ?

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడు సంజయ్‌ కుమార్‌ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10మందిని చంపినా అతడిలో ఏమాత్రం [more]

Update: 2020-05-27 08:49 GMT

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడు సంజయ్‌ కుమార్‌ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10మందిని చంపినా అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. చదువు లేకపోయినా, ఇంటర్‌ నెట్‌ ఉపయోగించడంలో దిట్ట. బిహార్‌లోని బిగుసరయి జిల్లా నుర్లపూర్‌ గ్రామంలో జన్మించాడు సంజయ్‌. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కొంత కాలానికి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీలోని ఒక సెల్‌ ఫోన్‌ రిపేర్‌ షాపులో సంజయ్‌ చాలా కాలం పనిచేశాడు. అక్కడ పనిచేసిన అనుభవం మరింత తోడయింది. తనకున్న పరిజ్ఞానాన్ని నేరాలు చేయడం, తర్వాత తప్పించుకోవడం ఎలా అన్న విషయాలకే ఉపయోగించుకున్నాడు.

గూగుల్ ద్వారా…

ముఖ్యంగా గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ టూల్‌లోని ‘ఓకే.. గూగుల్‌’ ఆప్షన్‌ ద్వారానే నేరాలకు అవసరమైన సమాచారాన్ని సముపార్జించాడు. ఓకే గూగుల్‌.. అంటూ ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేరు ఏవి.. అని తెలుసుకుని తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మత్తు టాబ్లెట్లను ఆహారంలో కలిపి 9 మందిని మట్టు బెట్టాడు. వైద్యుల సూచన లేకుండా ఈ మాత్రలు ఇవ్వకూడదని నిబంధనలు చెబుతున్నాయి. వరంగల్‌లోని ఒక మెడికల్‌ షాపులో ఎక్కువ ధర చెల్లించి మాత్రలు కొనుగోలు చేసినట్టు సమాచారం. మత్తు కోసం చాలా మంది వ్యసనపరులు ఇలాంటి మందులను దొంగ చాటుగా కొనుగోలు చేస్తుంటారు.

హత్య చేయడం టీ తాగినంత తేలికగా….

సంజయ్‌ ఇదే కోవకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక సంజయ్‌ సెల్‌ ఫోన్‌ సెర్చ్‌ చేస్తే…. హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్‌ రూమ్‌లో ఉన్న ఫోటోలు, నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. మనిషిని హత్య చేయడం సంజయ్‌కి టీ తాగినంత తేలిక. అతడిలో అపరాధ భావం మచ్చుకైనా కానరావడం లేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీళ్లు కూడా సంజయ్‌ను కదిలించలేకపోయాయి. ఆ చిన్నోడి ఏడుపు తన నేరానికి అడ్డు అవుతుందని భావించి కొట్టి గొంతు పిసికి, ప్రాణం ఉండగానే బావిలో పడేశానని పోలీసుల విచారణలో సంజయ్‌ ఒప్పుకున్నాడు.

Tags:    

Similar News