బ్రేకింగ్ : రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషికి బెయిల్ !
పెరారివలన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇప్పటికే పలు విడుతలుగా విచారణ జరిపింది. బుధవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్..
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న పెరారివలన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1991లో రాజీవ్ గాంధీ పై జరిగిన హత్యకేసులో పెరారివలన్ సహా ఏడుగురు దోషులుగా నిర్థారించబడ్డారు. వీరందరికీ జీవిత ఖైదు శిక్ష ఖరారవ్వగా.. 32 ఏళ్లుగా దోషులంతా జైలుజీవితాన్ని అనుభవిస్తున్నారు. దోషుల్లో ఒకడైన పెరారివలన్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
పెరారివలన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇప్పటికే పలు విడుతలుగా విచారణ జరిపింది. బుధవారం జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పెరారికి బెయిల్ ఇస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 32 ఏళ్లుగా అతను జైలు జీవితాన్ని అనుభవించాడని, అందుకే అతను బెయిల్ పొందేందుకు అర్హుడని కోర్టు పేర్కొంది. కానీ.. పెరారివలన్ కు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్రం అభ్యంతరం తెలుపుతూ వివిధ కారణాలను సర్వోన్నత న్యాయస్థానం ముందుంచింది. కేంద్రం వాదనలను తోసిపుచ్చిన సుప్రీం.. పెరారికి బెయిల్ మంజూరు చేసింది.