లెక్కతేలిన సెంట్రల్ బ్యాంక్ భారీ కుంభకోణం

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకు కుంభకోణంలో లెక్క తేల్చారు అధికారులు. 6.71కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గత [more]

Update: 2020-03-11 04:29 GMT

మచిలీపట్నం సెంట్రల్ బ్యాంకు కుంభకోణంలో లెక్క తేల్చారు అధికారులు. 6.71కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గత కొద్దిరోజుల క్రితం గోల్డ్ లోన్స్ మంజూరులో బ్యాంక్ అప్రైజర్ చేతివాటాన్ని బ్యాంకు అధికారులు గమనించారు. అంతర్గత ఆడిట్ ద్వారా కుంభకోణం జరిగినట్టు నిర్ధారించారు. 68 మందికి చెందిన గోల్డ్ లోన్ అకౌంట్ లో మొత్తం రూ. 6 కోట్ల71లక్షల 72వేల 125 బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా లోన్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.. బ్యాంకు సిబ్బంది గోల్డ్ అప్రైజర్ తో కలసి బంగారు ఆభరణాలు బదులుగా నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకు లో పెట్టినట్లు కనుగొన్నారు. గత కొన్ని రోజుల క్రితం బ్యాంకు అధికారులు కి అనుమానం వచ్చి గోల్డ్ లోన్ పెట్డిన వారందరికి పేపర్ ప్రకటన ద్వారా ఆభరణాలను పరిశీలించుకోవాలని అధికారులు కోరారు. ఈ కుంభకోణానికి కీలక సూత్రధారి మాచర్ల సత్య ప్రసాదరావు గత రెండు దశాబ్దాలుగా మచిలీపట్నం సెంట్రల్ బ్యాంక్ లో అప్రైజర్ గా పని చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News