బీహార్ రెండో దశ ఎన్నికలు ప్రారంభం

బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మొదటి దశలో 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండో దఫా 94 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. [more]

Update: 2020-11-03 02:15 GMT

బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మొదటి దశలో 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండో దఫా 94 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 94 అసెంబ్లీ స్థానాల్లో 1500 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈరజు జరిగే ఎన్నికల్లో మహాకూటమి తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి విడిపోయిన లోక్ జనశక్తి పార్టీ 52 స్థానాల్లో పోటీ చేయనుంది.

Tags:    

Similar News