ఇబ్బంది పెట్టొద్దు
ఆర్టీసీ సమ్మెపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజెయ్ కు [more]
ఆర్టీసీ సమ్మెపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజెయ్ కు [more]
ఆర్టీసీ సమ్మెపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజెయ్ కు గవర్నర్ ఫోన్ చేశారు. దీంతో మంత్రి పూర్తి వివరాలను గవర్నర్ కు తెలిపేందుకు రవాణ శాఖ కార్యదర్శిని పంపించారు. గవర్నర్ తమిళి సైని కలిసిన రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆర్టీసీ సమ్మెపై పూర్తి వివరాలు అందించారు. దీంతో ఆమె ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని సునీల్ శర్మ గవర్నర్ తమిళి సైకి వివరించారు.