ప్ర‌ధాని కార్య‌క్ర‌మంలోనే మంత్రిపై వేదింపులు

మ‌హిళ‌ల‌పై లైంగిక వేదింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ రంగ‌మైనా, ఏ ప్రాంత‌మైనా, ఏ స‌మ‌య‌మైనా ఈ వేదింపుల‌కు మిన‌హాయింపు కాదు. ఏకంగా చ‌ట్టాలు చేసే ప్ర‌జాప్ర‌తినిధులే లైంగిక [more]

Update: 2019-02-12 10:40 GMT

మ‌హిళ‌ల‌పై లైంగిక వేదింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ రంగ‌మైనా, ఏ ప్రాంత‌మైనా, ఏ స‌మ‌య‌మైనా ఈ వేదింపుల‌కు మిన‌హాయింపు కాదు. ఏకంగా చ‌ట్టాలు చేసే ప్ర‌జాప్ర‌తినిధులే లైంగిక వేదింపుల‌కు గుర‌వుతుండ‌టం.. అదీ ఓ మంత్రి చేతిలో… స్వ‌యాన ప్ర‌ధాన‌మంత్రి పాల్గొన్న కార్య‌క్ర‌మంలో.. వేలాది మంది చూస్తుండ‌గా.. అంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌ల‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇందులో త్రిపుర మంత్రి మ‌నోజ్ కాంతి దేబ్ సాటి మ‌హిళా మంత్రిపై వేదింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఏకంగా ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి ఉన్న వేదిక‌పైనే ఆమె న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. స‌ద‌రు వేదింపుల‌కు పాల్ప‌డిన మంత్రి యువ‌జ‌న‌, క్రీడ‌లు, ఆహార శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. అయితే, ఈ సంఘ‌ట‌న‌పై వేదింపుల‌కు గురైన మ‌హిళా మంత్రి ఇంకా ఎటువంటి ఫిర్యాదు చేయ‌లేదు.

Tags:    

Similar News