మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధిష్ఠానానికి షరతు విధించింది. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓడిన ఆమె ఈ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ స్థానాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరుడు, ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి ఇస్తున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ, టిక్కెట్ కచ్చితంగా తనకే ఇవ్వాలని శంకరమ్మ గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఇవాళ ఆమె టీఆర్ఎస్ కు ఓ షరతు విధించారు. హుజూర్ నగర్ టిక్కెట్ తనకు ఇవ్వాలని, తనకు కాకుంటే మరో ఎన్ఆర్ఐ అప్పిరెడ్డికి అయినా కేటాయించాలి గానీ సైదిరెడ్డికి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించడం సైదిరెడ్డి తరం కాదని ఆమె పేర్కొన్నారు.