ఎన్నికల వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి, బిహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా పదవికి రాజీనామా చేయడంతో పాటు ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆయన బిహార్ లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకాల పట్ల అసంతృప్తితో ఉన్నారు. తమ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలని ఆయన ఇటీవలి కాలంలో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే, బిహార్ లో బలంగా ఉన్న జేడీయూ, బీజేపీ... ఉపేంద్ర కుష్వాహా అడిగుతున్న సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. దీంతో ఆయన ఎన్డీఏ కు గుడ్ బై చెప్పారు. ఉపేంద్ర కుశ్వాహా యూపీఏతో చేరే అవకాశం ఉంది. ఆయన ఈ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.