Collector : కలెక్టర్ వారికి వార్నింగ్… నెట్టింట వైరల్

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారులకు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాసంగిలో వరివిత్తనాలు అమ్మితే ఊరుకోబోనని హెచ్చరించారు. అంతేకాదు [more]

Update: 2021-10-26 06:40 GMT

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారులకు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యాసంగిలో వరివిత్తనాలు అమ్మితే ఊరుకోబోనని హెచ్చరించారు. అంతేకాదు వరి విత్తనాలు విక్రయిస్తే వారిని వదిలిపెట్టబోనని, చెండాడుతా, వేటాడుతా అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యారు. యాసంగిలో వరి విత్తనాలను విక్రయించే హక్కు ఎవరికీ లేదన్నారు.

వరి వేశారంటే…?

వరి వేస్తే ఉరి అని ఆయన వ్యవసాయశాఖ సమీక్ష కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. డీలర్లు ఎవరూ వరి విత్తనాలను విక్రయించవద్దని, రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. ఎవరైనా వరి వస్తే ఉపేక్షించబోనన్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News