బ్రేకింగ్ : అమరావతిలో మరో ప్రాజెక్టు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వం మరో ప్రాజెక్టును రద్దు చేసుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసే ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు సింగపూర్ ప్రభుత్వం [more]

Update: 2019-11-12 05:49 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వం మరో ప్రాజెక్టును రద్దు చేసుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసే ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్లు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వంతో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది. అసెండాస్- సింగ్ బ్రిడ్జి ఒప్పందాన్ని ప్రభుత్వం, తాము పరస్పర అంగీకారంతోనే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఈ ఒప్పందం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాజధాని అమరావతిపై ఇప్పటికే నిపుణుల కమిటీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది.

Tags:    

Similar News