వివేకానంద మృతిపై సిట్ ఏర్పాటు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించనుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నామని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. కేసును అన్ని కోఫాల్లో విచారిస్తున్నామని, ఫోరెన్సీక్ నిపుణులను కూడా రప్పిస్తున్నట్లు చెప్పారు.
సిట్ కు ఆదేశం…..
అనుమానాస్పద మృతి వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రజల్లో అనుమానాలు రావడంపై హుటాహుటిన స్పందించారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డిజిపితో, ఇంటలిజెన్స్ అధికారులతో,కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు.వివేకానంద రెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.శాసన సభలో, శాసన మండలిలో, లోక్ సభలో ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారని అన్నారు. ఎంపిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.