కేసీఆర్ ది దరిద్రమైన భాష

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దరిద్రమైన భాషను వాడారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాడిన భాషను తాను [more]

Update: 2018-12-29 13:49 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దరిద్రమైన భాషను వాడారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాడిన భాషను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇక ఆంధ్రప్రజలు ఎందుకు జీర్ణించుకుంటారన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఛండాలమైన భాష వాడుతారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కు అడ్డుపడలేదని చెప్పిన కేసీఆర్, మీ మేనల్లుడు హరీశ్ రావు ఏం మాట్లాడో తెలియదా? అని నిలదీశారు. ఏపీకిప్రత్యేక హోదాఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని హరీశ్ డిమాండ్ చేయలేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను పోగొట్టుకోని వచ్చామని, మీ మాదిరిగా తాము మాటలు తప్పలేదన్నారు. మాటతప్పడంలో కేసీఆర్ దిట్ట అన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని, అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చెప్పి మాట తప్పింది మీరు కాదా? అని ప్రశ్నించారు. యాదిగిరిగుట్టను వ్యాటికన్ సిటీ చేస్తామని చెప్పలేదా? అని అన్నారు. అనుభవం ఉన్న, అవగాహన ఉన్న ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడటం సబబా అని అన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వృద్ధిరేటు ఏపీకంటే ఎందుకు తగ్గిందని ఆయన అన్నారు. మీరా మాకు ఎకానమి గురించి చెప్పేది అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. జనానికి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. నీ రాజకీయ జీవితమే చెత్త అని అన్నారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడన్నారు.

Tags:    

Similar News