ఎంతరాత్రైనా జరిపి తీరుతా

కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్షపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. స్పీకర్ రమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కుమారస్వామి కలిశారు. తనకు బలపరీక్షకు మరో రెండు రోజులు గడువు [more]

Update: 2019-07-22 14:07 GMT

కర్ణాటక శాసనసభలో విశ్వాస పరీక్షపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. స్పీకర్ రమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కుమారస్వామి కలిశారు. తనకు బలపరీక్షకు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అయితే కుమారస్వామి ప్రతిపాదనను స్పీకర్ రమేష్ కుమార్ తిరస్కరించారు. ఈరోజు చర్చ పూర్తయి ఎంతసమయమైనా ఓటింగ్ నిర్వహిస్తానని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఈరోజు ఓటింగ్ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Tags:    

Similar News