ఈ మంత్రితో మాకు ప్రాణిహాని ఉంది

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ల నుండి తమకు ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో మహబూబ్ నగర్ జిల్లాకి [more]

Update: 2021-07-28 08:59 GMT

మంత్రి శ్రీనివాస్ గౌడ్ అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ల నుండి తమకు ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన దంపతులు పిర్యాదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయం లో సాక్షిగా ఉన్న తనను కక్ష కట్టి మంత్రి అతని సోదరుడు అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని విశ్వనాధరావు, పుష్పలత దంపతులు తెలిపారు. స్థానిక రూరల్ సీఐ మహేశ్వర్ తో అర్ధరాత్రి ఇంటి పై దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేయిస్తున్నారని వారు తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసివేయించి కుటుంబాన్ని వీధిన పడేసారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఇదే విధంగా వేధిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ , అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పేర్లు రాసి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు.

Tags:    

Similar News