స్టార్ గెలెక్సీగా ఢిల్లీ

భారతదేశం జి 20 సదస్సుకు భారత్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. సదస్సులో పాల్గొనే వివిధ దేశాధినేతలు ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ స్టార్ గెలాక్సీగా మారింది.

Update: 2023-09-08 16:54 GMT

స్టార్ గెలెక్సీగా ఢిల్లీ

భారతదేశం జి 20 సదస్సుకు భారత్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. సదస్సులో పాల్గొనే వివిధ దేశాధినేతలు ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ స్టార్ గెలాక్సీగా మారింది. అధినేతలను ఆహ్వానించే అవకాశం లభించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. జీ 20 సదస్సు లక్ష్యాన్ని మోడీ వివరిస్తూ, మానవీయత కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యమని వివరించారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఉపయుక్తంగా జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. 18వ జీ 20 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ ప్రకటించిన జీ 20 థీమ్ అయిన ‘వసుదైక కుటుంబం’ భావనను ప్రధాని మోడీ మరోసారి గుర్తు చేశారు. ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు (One Earth, One Family, One Future)’’ అనే భావనను జీ 20 సదస్సు థీమ్ గా నిర్ధారించారు. భారత్ దృష్టిలో ప్రపంచమంటే ఇదేనన్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికే దిశగా చర్చ కొనసాగుతుంది. బలమైన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తారు. జీ 20 అధ్యక్షత పై మోడీ మాట్లాడుతూ ఇది నిర్ణయాత్మక, లక్ష్యపూరిత బాధ్యతగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, బహుముఖియ అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దికి అవసరమని ప్రధాని తెలిపారు. బహుముఖ అభివృద్ధికి టెక్నలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్నాయన్నారు. లింగ సమానత్వం దిశగా, మహిళల సాధికారత దిశగా, ప్రపంచ శాంతి దిశగా కృషి చేయాన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సంక్షేమ, అభివృద్ధి పలాలు దక్కాలన్న మహాత్మా గాంధీ ఆలోచనల దిశగా కృషి సాగించాల్సి ఉందన్నారు. దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

జీ20 సదస్సు అంటే ...

జీ20 అంటే 'గ్రూప్ ఆఫ్ 20'. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి ఉంటుంది. 1999లో జీ20ని స్థాపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ప్రణాళికలు రచించేందుకు ఇది వేదికగా మారింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ ఎకానమీపైనే దృష్టి సారించడం లేదు. సంవత్సరాలు గడిచే కొద్దీ.. ఆర్థిక వ్యవస్థతో పాటు వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులు వంటి అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వస్తున్నాయి. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియల్, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే.. 85శాతం ప్రపంచ జీడీపీ, 75శాతం గ్లోబల్ ట్రేడ్, మూడింట రెండో వంతు ప్రపంచ జనాభాకు ఈ జీ20 సదస్సు ప్రాతినిథ్యం వహిస్తుంది.

Tags:    

Similar News