Supreme court : కేంద్ర ప్రభుత్వంపై “సుప్రీం” ఘాటు వ్యాఖ్యలు

పెగాసస్ స్పై వేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు [more]

Update: 2021-10-27 06:01 GMT

పెగాసస్ స్పై వేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటర్డ్ జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని ధర్మాసనం పేర్కొంది. సమాచార యుగంలో ప్రస్తుతం ఉన్నామని, సాంకేతికత ఎంత ముఖ్యమో గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. గోప్యత హక్కును కాపాడటం ముఖ్యమని అభిప్రాయపడింది. నిపుణుల కమిటీని తాము ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయ భద్రత పేరుతో కేంద్రం తప్పించుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Tags:    

Similar News