బ్రేకింగ్ : మహారాష్ట్ర కేసు రేపటికి వాయిదా

మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల పిటీషన్ పై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అత్యవసర విచారణను చేపట్టింది. శివసేన తరుపున సీనియర్ [more]

Update: 2019-11-24 07:06 GMT

మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల పిటీషన్ పై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అత్యవసర విచారణను చేపట్టింది. శివసేన తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. మహారాష్ట్రలో గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. తెల్లవారు ఝామున ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటు పై తమకు కనీసం లేఖ కూడా గవర్నర్ నుంచి అందలేదన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉందని తెలిపారు. బీజేపీ బలనిరూపణను వెంటనే చేసుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. ఎన్నికలకు ముందు ఏర్పాటైన కూటమి విచ్ఛిన్నమయిందని చెప్పారు. రాష్ట్రపతి పాలనను తొలగించాలని గవర్నర్ సిఫార్సు చేయడమేంటని అన్నారు. రాత్రికి రాత్రే గవర్నర్ ఎలా సిఫార్సు చేస్తారన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతి పాలనను ఎలా ఎత్తివేస్తారని అన్నారు. తమ కూటమికి అవకాశమివ్వాలని కపిల్ సిబాల్ కోరారు. కర్ణాటక తీర్పును ఈ సందర్భంగా కపిల్ సిబాల్ ఉదహరించారు. కాంగ్రెస్ తరుపున అభిషేక్ మను సింఘ్వి వాదించారు.

బలం ఉదంటూ….

బీజేపీ తరుపున ముకుల్ రోహత్గి వాదనలు విన్పించారు. అయితే తమకు తగిన బలం ఉందని ముకుల్ రోహత్గి తెలిపారు. అందుకోసం గవర్నర్ ఈ నెల 30వ తేదీ వరకూ సమయమిచ్చారని అన్నారు. హడావిడిగా దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టులో విచారణ తర్వాత సుప్రీంకోర్టుకు రావాలన్నారు. అయితే న్యాయమూర్తులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. కేసు విచారణ చేపట్టాలా? వద్దా? అన్నది న్యాయమూర్తి విచక్షణాధికారమన్నారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేసును రేపటికి వాయిదా వేసింది. వెంటనే బలపరీక్ష అవసరం లేదంటూ చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News