టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్

హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్యకేసులో నిందితుడు కుంట శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. కుంట శ్రీనివాస్ మంథని మండల టీఆర్ఎస్ [more]

Update: 2021-02-19 01:13 GMT

హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్యకేసులో నిందితుడు కుంట శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. కుంట శ్రీనివాస్ మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాదుల హత్య దేశ వ్యాప్తంగా సంచలనం కావడం, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండటంతో కుంట శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనతో ఇకపై ఎవరూ పార్టీ పరంగా సంబంధాలు పెట్టుకోవద్దన్న ఆదేశాలు వెళ్లాయి.

Tags:    

Similar News